Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

నవజ్యోతి ఎఫెక్ట్‌.. భారీ గుంతకు మోక్షం !

నవజ్యోతి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.
SAI MANIKANTA
September 21, 2026 · 9 hours క్రితం
122 Views 3 Shares

కథనంపై స్పందించిన అధికారులు.. మరుసటి రోజే గుంత పూడ్చివేత

మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో చర్యలు
గుంతను తప్పించబోయి ప్రమాదం తృటిలో తప్పిన ఘటనపై నవజ్యోతి కథనం

తూప్రాన్‌, సెప్టెంబర్‌ 21 (నవజ్యోతి ప్రతినిధి):

తూప్రాన్‌ పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తాలో ఏర్పడిన భారీ గుంతపై నవజ్యోతి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఆదివారం గుంతను తప్పించబోయిన ఆర్టీసీ బస్సు స్కూటీపైకి దూసుకెళ్లి ప్రమాదం తృటిలో తప్పిన ఘటనను నవజ్యోతి వెలుగులోకి తీసుకురాగా.. కథనం ప్రచురితమైన మరుసటి రోజే అధికారులు స్పందించారు.

మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌కుమార్‌ సిబ్బందితో కలిసి నర్సాపూర్‌ చౌరస్తాకు చేరుకుని గుంతను పూడ్చే చర్యలు చేపట్టారు. చౌరస్తా నడిబొడ్డున భారీ గుంత ఏర్పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారిన విషయాన్ని నవజ్యోతి కథనం ద్వారా అధికారులు దృష్టికి తీసుకెళ్లింది.

రద్దీగా ఉండే చౌరస్తాలో గుంత కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కథనంలో ప్రస్తావించడంతో మున్సిపల్‌ అధికారులు తక్షణమే స్పందించారు. కథనం వచ్చిన మరుసటి రోజే గుంతను పూడ్చడంతో వాహనదారులకు కొంత ఉపశమనం లభించింది.

ప్రమాదం జరిగిన తర్వాత అయినా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడంపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన నవజ్యోతి కథనానికి స్పందించి సమస్యను పరిష్కరించిన మున్సిపల్‌ అధికారులను స్థానికులు అభినందించారు.

నవజ్యోతి కథనం వెలుగులోకి తెచ్చిన సమస్యకు మరుసటి రోజే పరిష్కారం.. ప్రజా సమస్యలపై స్పందించిన మున్సిపల్‌ అధికారులు.