Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
బిజినెస్

ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఎలక్ట్రిక్

ఈ కారు మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్, టాటా ఎలక్ట్రిక్ కార్లకు నేరుగా పోటీగా నిలవనుం
LAXMAN
September 20, 2026 · 1 day క్రితం
1 Views 0 Shares

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎంజీ మోటార్ సంస్థ తన కొత్త ‘హెక్టర్ టోమాహాక్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన అడాప్ట్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ పెద్ద సైజు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మరియు ఆల్-ఎలక్ట్రిక్ అనే రెండు ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్, టాటా ఎలక్ట్రిక్ కార్లకు నేరుగా పోటీగా నిలవనుంది. ఈ కారు అంతర్భాగంలో 15.6 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, 10 స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ పవర్ అడ్జస్టబుల్ సీట్లు వంటి విలాసవంతమైన ఫీచర్లను అందించారు. ఇది 5 సీటర్ మరియు 7 సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక సాంకేతిక వివరాల్లోకి వెళితే, ఇందులో 69.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 204 బీహెచ్‌పీ శక్తిని, 310 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని సంస్థ వెల్లడించింది.