పోతారంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు!
మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు – గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిణామాలు తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగినవని అన్నారు. ప్రజా పాలన ఏర్పడిన అనంతరం ప్రజలకు మరింత చేరువగా పాలన అందించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని సర్పంచ్ అన్నారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు – అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా ఉండి, గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఘట్టాలను గుర్తు చేసుకోవడంతో పాటు, భవిష్యత్తులో గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇమ్మడి దుర్గమ్మ, వార్డు సభ్యులు మంద యాదగిరి, మన్నె సురేష్, చెలిమెల పవన్ గౌడ్, సంకీ శ్రీకాంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రజిత, సీఏ దుర్గం కవిత, ఫీల్డ్ అసిస్టెంట్ కత్తి నరసింహులు, గ్రామ ప్రజలు సత్తయ్య, మల్లేష్ గౌడ్, పుట్ట కుమార్, శ్రీనివాస్, పంజాల నాగరాజు గౌడ్, సంకీ లక్ష్మణ్, తలారి శ్రీకాంత్, చెలిమెల రాకేష్ గౌడ్, తలారి ప్రశాంత్, చెలిమెల ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






