Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

పేదల ఇంట ఆనందం నింపిన ప్రజా ప్రభుత్వం-ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

November 17, 2026 · 2 weeks క్రితం
◉ 16 Views ↗ 0 Shares

నార్సింగి:నార్సింగి మండలంలోని రైతు వేదిక వద్ద నూతన ఆసరా పింఛన్లు మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు.రాజేందర్ రెడ్డి నాయకత్వంలో మండలంలో పార్టీని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. పేదల ఇంట ఆనందం వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఫలాలు అందుతాయని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని పేదల అందరికీ ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో నార్సింగి తహసీల్దార్ గ్రేస్ బాయ్ వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram