Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

అయ్యప్ప దేవాలయ పాత ట్రస్టును రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలి

November 28, 2026 · 30 minutes క్రితం
◉ 0 Views ↗ 0 Shares

భూదాన్ పోచంపల్లి: పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ నిర్వహణను పారదర్శకంగా కొనసాగించేందుకు పాత ట్రస్టును అధికారికంగా రద్దు చేసి, సబ్బండ వర్ణాల భక్తుల సమక్షంలో నూతన కమిటీని ఏర్పాటు చేయాలని సుమారు 50 మంది అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం దేవాలయ సన్నిధిలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమారు 22 సంవత్సరాల క్రితం నిర్మించిన అయ్యప్ప దేవాలయానికి గతంలో ట్రస్టు ఉండేదని, అయితే ట్రస్టు కార్యకలాపాలు నిలిచిపోవడంతో 2016లో అప్పటి ట్రస్టు సభ్యులు దేవాలయ సన్నిధిలోనే రాజీనామాలు సమర్పించారని తెలిపారు. అప్పటి నుంచి పదేళ్లుగా అయ్యప్ప స్వామి భక్త సమాజం పేరుతోనే ఆలయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అయినప్పటికీ కొందరు మళ్లీ పాత ట్రస్టు పేరును తెరపైకి తీసుకురావడం వల్ల వందలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం ఏ ఒక్కరికో పరిమితం కాదని, సమస్త భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అని అన్నారు. వ్యక్తిగత స్వార్థాలకు తావులేకుండా అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ నూతన కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

ఆలయ అభివృద్ధి, నిర్వహణలో ప్రతి భక్తుడికి భాగస్వామ్యం కల్పించాలని, ట్రస్టును నిబంధనల ప్రకారం అధికారికంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం దేవాలయ ప్రాంగణంలో కొత్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గురుస్వామి తండా వెంకటేశం గౌడ్, శెట్టి శ్రీనివాస్ ముదిరాజ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, అంకం మురళి, కీర్తి సంజీవ్, అంకం వినోద్, నక్క శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram