Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మేడ్చల్ మల్కాజిగిరి

పెరిగిన జీతాలు సరే.. ఏరియర్స్ మాటేమిటి?

November 28, 2026 · 25 minutes క్రితం
◉ 0 Views ↗ 0 Shares

కుత్బుల్లాపూర్, నవంబర్ 28 (నవజ్యోతి ప్రతినిధి): జీహెచ్‌ఎంసీలో విలీనమైన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు పెరిగిన వేతనాలు ఈ నెల నుంచే అమలు చేయడంతోపాటు, విలీనం నాటి నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని CITU బాచుపల్లి మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్ డిమాండ్ చేశారు. పోరాటాలతో వేతనాల పెంపు సాధించినా.. ఏరియర్స్ చెల్లింపుపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. వేతనాల్లో కోతలు లేకుండా పూర్తి మొత్తం చెల్లించాలని, కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం అమలు చేసి పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram