వారం రోజులుగా దుర్వాసన నీరే.. పట్టించుకునే నాథుడేరి?
◉ 0 Views
↗ 0 Shares
కుత్బుల్లాపూర్, నవంబర్ 28 (నవజ్యోతి ప్రతినిధి):
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు గత వారం రోజులుగా రంగు మారి, దుర్వాసనతో వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి, కనీసం గృహ అవసరాలకు కూడా పనికిరాని నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని బీజేపీ ప్రతినిధులు ఆరోపిస్తూ, నీటి నాణ్యత పరీక్షించి, సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






