Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
భక్తి

35 మంది భక్తులు మాలధారణ.. ప్రత్యేక పూజలు, శరణు ఘోషలతో ఆధ్యాత్మిక సందడి

November 29, 2026 · 25 seconds క్రితం
◉ 0 Views ↗ 0 Shares

తిప్పాపూర్: బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో ఆదివారం అయ్యప్ప స్వామి మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన 35 మంది భక్తులు ఇరుముడి దీక్షను స్వీకరించేందుకు అయ్యప్ప మాలను ధరించారు. గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అయ్యప్ప శరణు ఘోషల మధ్య మాలధారణ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు, పిఎసిఎస్ చైర్మన్ భీంరెడ్డి, గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram