సైబరాబాద్‌లో 18 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్!
ఎం. రమేష్, ఐపీఎస్
◉ 9 Views
↗ 1 Shares
సెప్టెంబర్ 25 వరకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాలని సూచన…విద్యా సంస్థలు ఆన్‌లైన్ – వర్చువల్ తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి
సైబరాబాద్, సెప్టెంబర్ 17 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ వాతావరణ శాఖ సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉందని జారీ చేసిన వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు
అప్రమత్తమయ్యారు. గణేష్ నిమజ్జన ఊరేగింపులు కూడా జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులు –
విద్యార్థుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు చేశారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, ఐపీఎస్ ఆధ్వర్యంలో
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్,
డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్ ట్రాఫిక్-1 – 2, సైబరాబాద్ సేఫ్టీ సెక్యూరిటీ
కౌన్సిల్ (SCSC) సీఈఓ, అడిషనల్ డీసీపీలు ట్రాఫిక్-1 – 2 – ట్రాఫిక్ అడ్మిన్,
ట్రాఫిక్ ఏసీపీలు – ఎస్‌హెచ్‌వోలతో వాతావరణ పరిస్థితులపై చర్చించారు.

అనంతరం సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అన్ని ఐటీ సంస్థలు – విద్యా సంస్థల
అధిపతులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో
ఉద్యోగులు – విద్యార్థులకు ఎదురయ్యే ప్రయాణ సంబంధిత ఇబ్బందులను తగ్గించడం,
అవసరమైన సేవలు సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం
నిర్వహించినట్లు తెలిపారు.

వర్షాల హెచ్చరికలు – గణేష్ నిమజ్జన ఊరేగింపులను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్
పరిధిలోని కంపెనీలు – సంస్థలు ముందుగానే పని వేళలను సర్దుబాటు చేసుకోవాలని
కోరారు. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 25 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం
2 గంటల తర్వాత ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని
సూచించారు.

ఉద్యోగుల ప్రయాణ సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడంతో పాటు రహదారులపై
వాహనాల రద్దీ – మౌలిక వసతులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ విధానాన్ని
పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీలు – సంస్థలను కోరారు.

పాఠశాలలు – ఇతర విద్యా సంస్థలు కూడా సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు పరిస్థితులను
దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ – వర్చువల్ తరగతులను నిర్వహించే అవకాశాన్ని
పరిశీలించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. ప్రతికూల వాతావరణంలో చిన్నారులు –
విద్యార్థులు ప్రయాణించాల్సిన అవసరాన్ని తగ్గించడంతో పాటు వారి భద్రత –
సౌకర్యాన్ని కాపాడేందుకు ఈ సూచనలు చేశారు.

అదే సమయంలో అత్యవసర సేవలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన సహకారం అందించాలని
విద్యా సంస్థలకు సూచించారు.
విద్యా సంస్థలకు సూచించారు.
వాతావరణ శాఖ సూచించిన మోస్తరు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులు –
విద్యార్థుల ప్రయాణాన్ని తగ్గించడం, గణేష్ నిమజ్జన కార్యక్రమాల సమయంలో
రహదారులపై రద్దీని నియంత్రించడం, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటంపై
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. వాతావరణ పరిస్థితులకు
అనుగుణంగా కంపెనీలు – విద్యా సంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని
కోరారు.