టోల్‌గేట్‌కు సమీపంలో కంటైనర్ బోల్తా.. 36 గంటలైనా తొలగించరా?
మాడుగులపల్లి, అక్టోబర్ 18:
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 18, 2026 · 1 month క్రితం
◉ 95 Views↗ 2 Shares
రోడ్డుపై కిలోమీటరు మేర ఇంజన్ ఆయిల్.. ప్రమాదం పొంచి ఉన్నా అధికారుల నిర్లక్ష్యమా?
మాడుగులపల్లి, అక్టోబర్ 18: అద్దంకి–నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కుక్కడం గ్రామ సమీపంలోని వాసవి సాల్వెంట్ వద్ద ఇంజన్ ఆయిల్ లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగి 36 గంటలు గడిచినా కంటైనర్‌ను తొలగించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటైనర్ నుంచి వెలువడిన ఇంజన్ ఆయిల్ రహదారిపై సుమారు కిలోమీటరు మేర వ్యాపించడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అగ్నిప్రమాద ముప్పు కూడా పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.
టోల్‌గేట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం.. అయినా చర్యలేవీ?
టోల్‌గేట్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా టోల్‌గేట్ నిర్వహణ సంస్థ, రహదారి అధికారులు, పోలీసులు సమన్వయంతో స్పందించి కంటైనర్‌ను వెంటనే తొలగించాలని, రహదారిపై వ్యాపించిన ఆయిల్‌ను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి వాహనదారులకు ప్రమాదం లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి