Friday, November 27, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో అక్రమ సెల్లార్ తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు! చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ ఇబ్రహీంపట్నం, నవంబర్ 26ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ గేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే అక్రమంగా సెల్లార్ తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే కొందరు వ్యక్తులు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా లోతైన గుంతలు తవ్వడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అంతేకాకుండా, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి, అక్రమ సెల్లార్ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

◷ 1 day క్రితం
అన్ని రంగారెడ్డి వార్తలు ↓

రంగారెడ్డి వార్తలు