Friday, November 27, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు

November 27, 2026 · 1 hour క్రితం
◉ 8 Views ↗ 0 Shares

– రూ.15 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్

సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ ఇంజనీర్ ఏ.రాజేష్ కుమార్, అవుట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ ఏ.శివారెడ్డి పట్టుబడ్డారు. ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం 2025 గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊబ చెరువులో చేపట్టిన పూడికతీత పనులకు సంబంధించిన రూ.4.50 లక్షల కాంట్రాక్టు బిల్లును ప్రాసెస్ చేసినందుకు ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ అధికారులు వలపన్నారు. రాజేష్ కుమార్ లంచం తీసుకొని శివారెడ్డికి అప్పగించగా, అతడి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram