సమావేశం పెట్టండి-టీచర్ల సమస్యలు తీర్చండి-TRTF
◉ 0 Views
↗ 0 Shares
మెదక్:ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) కోరింది.ఈ మేరకు TRTF రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్ కుమార్ డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ గారికి వినతిపత్రం సమర్పించారు.ఈ ఏడాది మే 15, జూలై 10, అక్టోబర్ 5 తేదీలలో సంఘం తరపున ఇచ్చిన వినతిపత్రాలలోని అంశాల ప్రస్తుత స్థితిని రాబోయే సమావేశపు ఎజెండాలో ప్రత్యేక అంశంగా చేర్చి తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని నాయకులు కోరారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






