Friday, November 27, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
సంగారెడ్డి

ఆపదలో పేద కుటుంబానికి ఆర్థిక భరోసా

November 27, 2026 · 7 hours క్రితం
◉ 7 Views ↗ 0 Shares

మంత్రి దామోదర్ చొరవతో రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

చౌటకూర్ : అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలిచింది. చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొమ్మరాజు మహేశ్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడంతో వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరైంది. సంబంధిత చెక్కును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటకూర్ మండలంలో ఇప్పటివరకు పేద కుటుంబాలకు రూ.11.22 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదల వైద్యానికి ఆర్థిక సహాయం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మేఘరాజ్ నాయక్, మహేశ్ రాథోడ్, కుమ్మరి రాజ్ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram