Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మేడ్చల్ మల్కాజిగిరి

కార్తీక మాసంలో కీసరగుట్టలో ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు

November 27, 2026 · 6 hours క్రితం
◉ 2 Views ↗ 0 Shares

కీసర, నవంబర్ 27: కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ శివ దుర్గ సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కీసర డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కోలా బాలరాజు యాదవ్, స్థానిక నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకోవడం పవిత్రమైన విషయమని, ప్రతి ఒక్కరూ భక్తి, ధర్మం, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఆ పరమశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా కీసర డివిజన్ అధ్యక్షుడు పొట్ట ఆంజనేయులు, కీసర డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్నోజిగూడ మల్లారెడ్డి, బీజేవైఎం రూరల్ జిల్లా కార్యదర్శి దేశం రమేష్ గౌడ్, నాయకుడు కుమ్మరాజు సతీష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram