ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా..డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నిజాంసాగర్, నవంబర్ 27 నవజ్యోతి: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కార్యక్రమాన్ని నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకం అమలు లక్ష్యాలను, ప్రతి కుటుంబానికి కలిగే ఆర్థిక భద్రత గురించి వివరించారు. కుటుంబంలో ఆపద సమయాల్లో అండగా నిలిచి, ఆర్థిక భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ప్రతి కుటుంబానికి భద్రత, ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, గ్రామ సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, పంచాయతీ కార్యదర్శి బీమ్ రావు, సర్పంచు లక్ష్మయ్య,
వార్డు సభ్యులు సాయిలు,కరోబర్ సాయిలు,తదితరులు ఉన్నారు.






