Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
రంగారెడ్డి

నందివనపర్తి నుండి యాచారం ప్రధాన రహదారిపై తవ్విన గుంతలతో ప్రమాదాల ముప్పు. వెంటనే పూడ్చాలని వాహనదారుల ఆందోళన..!

November 12, 2026 · 2 weeks క్రితం
◉ 7 Views ↗ 0 Shares

ఇబ్రహీంపట్నం , నవంబర్ 12(నవజ్యోతి ప్రతినిధి )
నందివనపర్తి నుంచి యాచారం వెళ్లే ప్రధాన రహదారిపై కేబుల్ కనెక్షన్ల కోసం జేసీబీలతో తవ్విన గుంతలను గత కొద్ది రోజులుగా పూడ్చకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోడ్డు పక్కన మరియు ముఖ్యంగా రోడ్డు మలుపుల వద్ద పెద్ద ఎత్తున తవ్విన గుంతలు అలాగే వదిలేయడం వల్ల రాత్రి సమయాల్లో ప్రయాణించే వారికి అవి సరిగ్గా కనిపించడం లేదు. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారని, చీకట్లో పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు మరియు వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన మార్గంలో నిత్యం వందలాది వాహనాలు, పాఠశాల బస్సులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు మరియు సంబంధిత కేబుల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఏ క్షణంలోనైనా ప్రాణాపాయ ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డుపై తవ్విన గుంతలను వెంటనే పూడ్చి వేయాలి.పనులు పూర్తికానిచోట రాత్రి సమయాల్లో వాహనదారులను అప్రమత్తం చేయడానికి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలి.
ప్రాణాలు గాల్లో కలిసేలా ఉన్న ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram