ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా!
వికారాబాద్ జిల్లా పీఆర్టీయూ-టీఎస్ పరిగి మండల శాఖ అధ్యక్షుడిగా మంచనపల్లి శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగా గురువారం పరిగిలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. అంబేద్కర్ విజ్ఞాన వేదిక – మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని శ్రీనివాస్‌ను సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల హక్కులు – సంక్షేమం కోసం అందరితో సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
అదేవిధంగా సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తనకు సాధ్యమైనంత వరకు సహకరిస్తానని శ్రీనివాస్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సన్మానించిన అంబేద్కర్ విజ్ఞాన వేదిక – మాల మహానాడు నాయకులు, సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అంబేద్కర్ విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ముత్యప్ప, జిల్లా నాయకులు దోమ వెంకటయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సుల్తాన్పూర్ వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కడుమూర్ రాజు, ఆర్. రాములు, అంబేద్కర్ విజ్ఞాన వేదిక నియోజకవర్గ అధ్యక్షులు రూప్‌ఖాన్‌పేట్ నర్సిములు, ప్రధాన కార్యదర్శి ఖుడవంద్పూర్ నర్సిములు, కార్యవర్గ సభ్యులు హన్మప్ప, రామచంద్రయ్య, శ్రీశైలం, రాజేందర్, దాసు, పరిగి మాల మహానాడు అధ్యక్షులు నగేష్, ఉప సర్పంచ్ నర్సాయగుడెం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






