సీఎం సభను విజయవంతం చేయడమే లక్ష్యం-మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్
వెల్దుర్తి నవజ్యోతి ప్రతినిధి ముకుంద్
వెల్దుర్తి:సిద్దిపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు వెల్దుర్తి, శేరిలా గ్రామాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరారు.నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ కిష్టా గౌడ్ కాంగ్రెస్ నాయకులు బంజరవి నాయకత్వంలో వెల్దుర్తి శేరిలా గ్రామాల నుంచి వందలాది మంది కార్యకర్తలు సిద్దిపేటకు తరలి వెళ్లారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా బయలుదేరుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఇందిరమ్మ బీమా కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్న నేపథ్యంలో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.వెల్దుర్తి మండలం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లడం పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. సభా ప్రాంగణంలో ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని నాయకులు తెలిపారు.






