స్థిరంగా బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం హైదరాబాద్ మరియు విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల తుది బంగారం ధర రూ. 1,55,840 వద్ద మార్పు లేకుండా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ. 1,42,850 గాను, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,880 గానూ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలలో కూడా ఇవే ధరలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,990 కాగా, ముంబై, కోల్కతా, కేరళ ప్రాంతాల్లో రూ. 1,55,840 గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ముగిశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ. 2,55,000 వద్ద కొనసాగుతోంది.






