చిన్న చెరువులో పడి వ్యక్తి మృతి
చిన్న చెరువులో మృతదేహంగా
◉ 541 Views
↗ 4 Shares
రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
ప్రమాదవశాత్తూ పడ్డాడా.. మరేదైనా కారణమా?
పలు కోణాల్లో కేసు దర్యాప్తు: ఎస్‌ఐ సుభాష్ గౌడ్
మనోహరాబాద్, సెప్టెంబర్ 20 (నవజ్యోతి ప్రతినిధి):
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి చిన్న చెరువులో మృతదేహంగా లభించడంతో లింగారెడ్డిపేట గ్రామంలో విషాదం నెలకొంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన అబ్బదగారి స్వామి (33) రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
ఆదివారం గ్రామంలోని చిన్న చెరువులో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్వామి ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.






