బండారు యాదగిరి జన్మదినాన రక్తదాన శిబిరం
సంగారెడ్డి, సెప్టెంబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 22న సంగారెడ్డిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. సంగారెడ్డి ఐబీ వద్ద ఉదయం 10.30 గంటలకు శిబిరం ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జన్మదిన వేడుకలను సామాజిక సేవకు వేదికగా మార్చాలనే ఉద్దేశంతో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో లేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
“మీరు చేసే రక్తదానం ఒక ప్రాణానికి పునర్జన్మ” అనే సందేశంతో జర్నలిస్టులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు. ఆరోగ్యంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. బండారు యాదగిరి జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో నిర్వహించడం ద్వారా సమాజంలో రక్తదానం ప్రాధాన్యంపై మరింత అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






