అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా !
◉ 6 Views
↗ 1 Shares
ఘట్కేసర్, సెప్టెంబర్ 17 (నవజ్యోతి ప్రతినిధి):
డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఏసీపీ శ్రీధర్, పట్టణ ప్రణాళిక అధికారి సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నాగారం, రాంపల్లి – ఘట్కేసర్ గ్రామాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లు – అదనపు అంతస్తులను పట్టణ ప్రణాళిక సిబ్బంది సహకారంతో కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీధర్ హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.






