Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రీడలు

క్వార్టర్‌ఫైనల్లో టీమిండియా.. ప్రత్యర్థి ఖరారు!

ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనున్న శ్రేయస్‌ సేన..సీడింగ్‌, ఐసీసీ ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌కు నేరుగా బెర్త్‌
SAI MANIKANTA
September 26, 2026 · 3 days క్రితం
◉ 6 Views ↗ 1 Shares

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (నవజ్యోతి ప్రతినిధి): ఏషియన్‌ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా క్వార్టర్‌ఫైనల్‌ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే రెండో క్వార్టర్‌ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. సీడింగ్‌, ఐసీసీ ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌కు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ లభించింది.

గ్రూప్‌-ఏలో ఆఫ్ఘనిస్తాన్‌, జపాన్‌, నేపాల్‌ జట్లు పోటీపడ్డాయి. జపాన్‌, నేపాల్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆఫ్ఘనిస్తాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ఈ గ్రూప్‌లో నేపాల్‌ అగ్రస్థానంలో, ఆఫ్ఘనిస్తాన్‌ రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించాయి.

గ్రూప్‌-ఏ టాపర్‌గా నిలిచిన నేపాల్‌ సెప్టెంబర్‌ 29న జరిగే మూడో క్వార్టర్‌ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. అంతకుముందు జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో నేపాల్‌.. ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించడం విశేషం.

ఇక గ్రూప్‌-బి నుంచి మరో రెండు జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు రావాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో మలేషియా, హాంగ్‌కాంగ్‌ చైనా, ఒమన్‌ పోటీపడుతున్నాయి. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే జట్టు సెప్టెంబర్‌ 29న జరిగే నాలుగో క్వార్టర్‌ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొంటుంది. రెండో స్థానంలో నిలిచే జట్టు సెప్టెంబర్‌ 28న జరిగే తొలి క్వార్టర్‌ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ప్రస్తుతం మలేషియా, హాంగ్‌కాంగ్‌ చెరో రెండు పాయింట్లతో ముందంజలో ఉండగా.. ఒమన్‌ ఇంకా ఖాతా తెరవలేదు.

ఏషియన్‌ గేమ్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఉన్న భారత్‌ ఈసారి ఫుల్‌ మెంబర్‌ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని జట్టులో అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబే, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram