Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
హైదరాబాద్

రాష్ట్ర ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా కుంట్ల శ్రీనివాస్

November 21, 2026 · 1 week క్రితం
◉ 6 Views ↗ 0 Shares

– స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం

హైదరాబాద్ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఐ అండ్ పీఆర్ ఫొటోగ్రాఫర్ కుంట్ల శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్, విరాహత్ అలీ పాల్గొని ఉత్తమ ఫొటోగ్రాఫర్లను అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ఛాయాచిత్రకళ సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన అద్భుతమైన కళ అని పేర్కొన్నారు. ఒక ఛాయాచిత్రం ఎన్నో సంవత్సరాలపాటు గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలుస్తుందని తెలిపారు. ఫొటోగ్రాఫర్లు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తమ నైపుణ్యంతో అద్భుతమైన చిత్రాలను తీస్తున్నారని కొనియాడారు. అలాంటి ప్రతిభావంతులను గుర్తించి రాష్ట్రస్థాయి అవార్డులతో సత్కరించడం సంతోషకరమన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లు తమ ప్రతిభతో సమాజానికి ఉపయోగపడే మంచి ఛాయాచిత్రాలను అందించాలని సూచించారు. ఉత్తమ చిత్రాలను రూపొందించేందుకు ఫొటోగ్రాఫర్లు చూపుతున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు. ఛాయాచిత్రం ద్వారా ఒక సంఘటనను, సందర్భాన్ని చిరకాలం గుర్తుండేలా చేయవచ్చని తెలిపారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన కుంట్ల శ్రీనివాస్‌ను కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. ఫొటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఇలాంటి గుర్తింపు లభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అవార్డు అందుకున్న ఇతర ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు కూడా అభినందనలు తెలిపారు. ఛాయాచిత్రకళలో మరింత ప్రతిభ కనబరిచి సమాజానికి మంచి చిత్రాలను అందించాలని ఆకాంక్షించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram