Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

రామేశ్వర్ పల్లిలో ఘనంగా చేయూత ఆసరా పెన్షన్ల పంపిణీ !

అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత !
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
November 18, 2026 · 2 weeks క్రితం
◉ 10 Views ↗ 0 Shares

బిక్కనూరు, నవంబర్ 18 (నవజ్యోతి ప్రతినిధి): బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం చేయూత ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీడీవో సవితా రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎడ్ల రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram