Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

కన్నీటి గోసలో రైతన్న-పట్టించుకోని ప్రభుత్వం-బట్టి అజయ్

November 18, 2026 · 2 weeks క్రితం
◉ 10 Views ↗ 0 Shares

చిన్న శంకరంపేట(రా) నవజ్యోతి ముకుంద్:చిన్న శంకరంపేట మండలం ప్యాటగడ్డ,ఎస్ కొండాపూర్ గ్రామాల్లో మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బట్టి అజయ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది.గ్రామ సర్పంచులు, రైతులతో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ప్యాటగడ్డలో 20 ఎకరాల్లో పంట ఎండిపోయినట్లు తేలింది.అనంతరం బట్టి అజయ్ మాట్లాడుతూ, రైతు బాధలు వర్ణాతితం, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరుతడి పంటలకు ఉచిత విత్తనాలు ఇవ్వాలన్నారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. రైతులకు అండగా తెలంగాణ రక్షణ సేన తరుపున పోరాడతామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన నిలబడి పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు.కార్యక్రమంలో జిల్లా CITU కార్యదర్శి మల్లేశం, మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొండల్ రెడ్డి, TRS యువజన నేతలు నరేష్ యాదవ్, శ్రీకాంత్, భాను, మధు కార్తిక్ పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram