గుజరాత్లోని భరూచ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రసాయన తయారీ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పేలుడు సంభవించిన సమయంలో పరిశ్రమలో కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
పేలుడుకు కారణాలపై ఆరా
ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు ఎలా సంభవించింది, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి