Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

ప్రజలకు బీమా పథకం ప్రయోజనాలు అందేలా చూడాలి..డీఎల్‌పీవో ప్రసాద్‌రావు

November 28, 2026 · 1 day క్రితం
◉ 3 Views ↗ 0 Shares

నిజాంసాగర్,నవ జ్యోతి, నవంబర్ 28, మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మండల ప్రత్యేక అధికారి, డీఎల్‌పీవో ప్రసాద్‌రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పథకం అమలు జరుగుతున్న తీరును, లబ్ధిదారుల వివరాలను పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. పథకం అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని, లబ్ధిదారుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరిన్ కుమార్, గ్రామ అధ్యక్షులు మంగలి రాములు, మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రాములు, నాయకులు దుర్గయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram