Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

రాజ్యాంగ స్ఫూర్తితో ముందడుగు

మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి: రేగులగూడెం సర్పంచ్ పాగే ఆమని సురేష్
November 27, 2026 · 2 days క్రితం
◉ 12 Views ↗ 0 Shares

కాటారం, నవంబర్ 26 (నవజ్యోతి ప్రతినిధి): రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రేగులగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ పాగే ఆమని సురేష్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగమని కొనియాడారు. హక్కులను పొందడంతో పాటు ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. భేదభావాలు లేని సమాజ నిర్మాణానికి రాజ్యాంగ ఆశయాలు దారి చూపుతాయని, భావితరాలకు వాటిని అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు తమ హక్కులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఉపసర్పంచ్ వెంకటస్వామి, నంది శశి, గ్రామపంచాయతీ మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram