Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

పేదలకు వైద్య ఖర్చులకు ఆర్థిక చేయూత అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

November 23, 2026 · 6 days క్రితం
◉ 8 Views ↗ 0 Shares

భూదాన్ పోచంపల్లి, నవంబర్23(నవ జ్యోతి ప్రతినిధి) : మండలంలోని మెహర్ నగర్ గ్రామానికి చెందిన కోట లింగయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్ అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అర్హులైన నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏర్పుల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల శ్రీలత మధుసూదన్, మండల కాంగ్రెస్ కార్యదర్శి రేవల్లి యాదగిరి, వార్డు సభ్యులు కళ్లెం సాయిలు, కోట సురేందర్, కుందారపు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram