Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

గుజరాత్‌ రసాయన పరిశ్రమలో పేలుడు.. ఐదుగురు మృతి!

భరూచ్‌, అక్టోబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 17, 2026 · 1 month క్రితం
◉ 9 Views ↗ 1 Shares
మరో ఐదుగురికి గాయాలు.. భరూచ్‌ జిల్లాలో ఘటన

భరూచ్‌, అక్టోబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):

గుజరాత్‌లోని భరూచ్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రసాయన తయారీ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పేలుడు సంభవించిన సమయంలో పరిశ్రమలో కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడుకు కారణాలపై ఆరా

ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు ఎలా సంభవించింది, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram