Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

బ్యాంకుల సమ్మె

'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' (యూఎఫ్‌బీయూ) పిలుపు
LAXMAN
September 20, 2026 · 1 day క్రితం
2 Views 0 Shares

‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయి. సెప్టెంబర్ 26, 27 తేదీలు శని, ఆదివారాలు కావడం, దాని వెంటనే మూడు రోజుల సమ్మె కొనసాగనుండటంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖలలో భౌతిక సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తమ ఖాతాదారులను హెచ్చరించింది. తమ డిమాండ్ల సాధన కోసం యూఎఫ్‌బీయూ ఇప్పటికే సెప్టెంబర్ 11న ఒకరోజు సమ్మె నిర్వహించగా, ఇప్పుడు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు రెండో విడత నిరసన చేపట్టనుంది. డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని యూనియన్లు ప్రకటించాయి. సమ్మె కారణంగా చెక్కుల క్లియరెన్స్, పత్రాల పరిశీలన వంటి ప్రత్యక్ష సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున, ఏటీఎంలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ మరియు యోనో వంటి డిజిటల్ సేవలనే వినియోగించుకోవాలని ఎస్‌బీఐ సూచించింది.