Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత మహిళల విజయం

ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం
LAXMAN
September 20, 2026 · 1 day క్రితం
3 Views 1 Shares

ఐచి-నాగోయా సెప్టెంబర్ 20 (డిజైనర్‌ టెక్‌ గురు ప్రతినిధి): ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు 19-0 గోల్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత క్రీడాకారులు ప్రత్యర్థి జట్టుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. భారత జట్టు విజయంలో దీపిక ఎనిమిది గోల్స్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా, ఇషిక మూడు, నవనీత్ కౌర్ రెండు, లాల్‌థంత్లువాంగి రెండు గోల్స్ సాధించారు. లాల్‌రెమ్‌సియామి, బాల్జీత్ కౌర్, నేహా, సాక్షి రాణా తల ఒక గోల్ చేశారు. మ్యాచ్ ఆరో నిమిషంలో లాల్‌రెమ్‌సియామి గోల్‌తో పాయింట్ల ఖాతా తెరవగా, తొలి రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత్ 5-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకుంటూ దీపిక చెలరేగిపోయింది. ఉజ్బెకిస్థాన్ జట్టు మొత్తం మ్యాచ్‌లో కేవలం ఒక్క షాట్ మాత్రమే కొట్టగలిగింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 21న ఇండోనేషియాతో తలపడనుంది.