మృతుడి కుటుంబానికి టీఆర్ ఫౌండేషన్ చేయూత.. 25 కిలోల బియ్యం అందజేత
◉ 5 Views
↗ 0 Shares
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 23(నవ జ్యోతి ప్రతినిధి): పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని రేవనపల్లి గ్రామానికి చెందిన బొడ్డు గణేష్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో టీఆర్ ఫౌండేషన్ ద్వారా సహాయం అందించారు. పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ చొరవతో ఫౌండేషన్ సౌజన్యంతో గణేష్ కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు.
కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించడం ద్వారా కొంత ఊరట కల్పించారు. ఆపదలో ఉన్నవారికి తమ వంతు సహాయం అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






