మంత్రి శ్రీధర్ బాబును కలిసిన బొంతు శ్రీదేవి యాదవ్
ఉమ్మడి చర్లపల్లి డివిజన్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై వినతి
పెండింగ్ పనుల పూర్తికి సహకరిస్తానని మంత్రి హామీ
చర్లపల్లి, నవంబర్ 29,:
ఉమ్మడి చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ బొంతు శ్రీదేవి యాదవ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉమ్మడి చర్లపల్లి డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వివిధ కారణాలతో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు, చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనులపై చర్చించారు. ఆయా పనులకు సంబంధించి ప్రత్యేకంగా సమయం కేటాయించాలని మంత్రిని కోరారు.దీనిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ, డివిజన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు, డివిజన్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.






