చైతన్య భూమి ప్రాంగణంలో ఘనంగా మహనీయులకు ఘన నివాళి!
అంబేద్కర్ విగ్రహానికి 247వ పూలమాల.. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి 47వ జ్ఞానమాల
ముఖ్య అతిథులుగా కామాక్షి జనార్దన్, యాట రాజు.. మహనీయులకు ఘన నివాళులు
కీసర,నవంబర్ 29 :
కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ డివిజన్ రాజీవ్ గృహకల్ప కాలనీలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైతన్య భూమి ప్రాంగణంలో నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామాక్షి జనార్దన్, యాట రాజు హాజరై మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి 247వ పూలమాల కార్యక్రమం, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి 47వ జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలు, వారు చేసిన సామాజిక సేవలు, విద్యా ఉద్యమాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన విద్యా సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.జ్ఞానమాల వంటి కార్యక్రమాలు సమాజంలో విద్యా చైతన్యం, సామాజిక స్పృహ, మహనీయుల చరిత్రపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్న మాల సంక్షేమ సంఘం నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమం లో సంఘం పెద్దలు తాడేపల్లి అబ్బులు,మాజి అధ్యక్షుడు మోతే రాజేంద్రప్రసాద్,సంఘ సభ్యులు పాడుగుల చంద్రమౌళి,సానాది సాయిబాబ, చెన్నయ్య,బత్తుల శ్రీనివాస్,గ్యాస్ వెంకటేష్ అనిల్,తదితరులు పాల్గొన్నారు.






