ఆధ్యాత్మిక క్షేత్రం కీసరగుట్టలో ఆత్మీయ వనభోజనాల సందడి!
కార్తీకమాస పవిత్రత.. ప్రకృతి ఒడిలో ఆత్మీయ సమ్మేళనం
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు.. ఉసిరి, బిల్వ మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం
కీసర, నవంబర్ 29 :
ఆధ్యాత్మికత, ఆత్మీయత, ప్రకృతి ఆరాధనల మేళవింపుగా చారిత్రక కీసరగుట్ట పుణ్యక్షేత్రంలో కార్తీకమాస వనభోజనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కీసర మండల ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు బక్కని కుమార్, ప్రధాన కార్యదర్శి కనుకుంట శ్యామ్ కుమార్, మండల ఇన్చార్జి జగన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ సందర్భంగా ఉమ్మడి కీసర మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా కార్తీకమాస పవిత్రతకు ప్రతీకగా ఉసిరి, బిల్వ మొక్కలను నాటి వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్తీకమాసంలో ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆత్మీయంగా వనభోజనాలు నిర్వహించడం అందరిలో ఆనందోత్సాహాలు నింపింది. ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతి పరిరక్షణ, సామాజిక ఐక్యత, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ ఆధ్యాత్మికత, ఆత్మీయతను కలగలిపి నిర్వహించే ఈ వనభోజనాల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామారం సుజాత, మాజీ ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్, సలహాదారు మల్లేష్,అధికార ప్రతినిధి మంచాల శ్రీకాంత్,గ్రామ అధ్యక్షులు మేకల మహేష్, మంచాల రాజలింగం,సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్,రమేష్,స్వామి,
బంటు శ్రీనివాస్,కొమ్ము రవి,కట్ట శంకరయ్య, మహేష్,చినింగిని బాలరాజ్,గుర్రం శ్రీధర్ రెడ్డి, వీరేష్,జగన్నాధం,మహేష్ తదితరులు, బంధుమిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






