Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

సిద్ధరామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు !

SAI MANIKANTA
SAI MANIKANTA
September 16, 2026 భక్తి
శ్రావణమాసం సందర్భంగా రూ.3,57,298 ఆదాయం
బిక్కనూర్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి):
శ్రావణమాసం సందర్భంగా బిక్కనూర్‌ శ్రీ సిద్ధరామేశ్వర ఆలయ హుండీని అధికారుల సమక్షంలో లెక్కించారు. హుండీ ద్వారా మొత్తం రూ.3,57,298 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారి శ్రీధర్‌ తెలిపారు.
🪔 శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక లెక్కింపు

ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు – ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కించారు. శ్రావణమాసం సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,57,298 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి శ్రీధర్‌ వెల్లడించారు.

👥 పాల్గొన్న కమిటీ సభ్యులు

ఈ కార్యక్రమంలో పునర్నిర్మాణ కమిటీ చైర్మన్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ దయాకర్‌ రెడ్డి, సభ్యులు చికోటి ప్రభాకర్‌, నాగార్తి రమేష్‌ రెడ్డి, కార్తీక్‌, భాగయ్య, నారాయణ , బాగారెడ్డి , ఈశ్వర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

🙏 పూజారులు – ఆలయ సిబ్బంది హాజరు

పూజారులు రామగిరి శర్మ – రాజేశ్వర శర్మతో పాటు ఆలయ సిబ్బంది – మహిళలు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.