Thursday, September 17, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

షాజాద్‌ భట్టి నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన !

SAI MANIKANTA
SAI MANIKANTA
September 16, 2026 జనరల్

యూఏపీఏ కింద కేంద్రం కీలక నిర్ణయం.. 14 రాష్ట్రాల్లో ఆపరేషన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి):

పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్నట్లు కేంద్రం పేర్కొన్న
షాజాద్‌ భట్టి నెట్‌వర్క్‌ (SBN)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం – 1967 (UAPA) కింద ఈ నిర్ణయం తీసుకుంది.
యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం, వనరులను సమీకరించడం – హింసాత్మక కార్యకలాపాల
ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలను కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

🚨 యూఏపీఏ జాబితాలో 46వ సంస్థ
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌ 16న జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా
UAPAలోని మొదటి షెడ్యూల్‌లో షాజాద్‌ భట్టి నెట్‌వర్క్‌ను 46వ నంబర్‌లో
ఉగ్రవాద సంస్థగా చేర్చింది.

కేంద్రం పేర్కొన్న ఆరోపణలు
యువతను ర్యాడికలైజ్‌ చేయడం
అక్రమ కార్యకలాపాలకు వనరుల సమీకరణ
ఆయుధాలు – పేలుడు పదార్థాలు – మాదకద్రవ్యాల అక్రమ రవాణా
హింసాత్మక కార్యకలాపాల ద్వారా ఉగ్రవాద ప్రోత్సాహం
పోలీస్‌ – రక్షణ – మతపరమైన ప్రాంతాలపై రెక్కీ
డిజిటల్‌ వేదికల ద్వారా రెచ్చగొట్టే సందేశాల ప్రచారం

14 రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్‌
ఆగస్టు 12న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దాడులకు కుట్రలను అడ్డుకునేందుకు
14 రాష్ట్రాల్లో సమన్వయ ఆపరేషన్‌ చేపట్టినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్ర పోలీసులతో రియల్‌టైమ్‌ సమాచార మార్పిడి వ్యవస్థ ద్వారా ఈ చర్యలు చేపట్టినట్లు
పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌
62
హర్యానా
52
ఢిల్లీ
51
పంజాబ్‌
44
రాజస్థాన్‌
15
మహారాష్ట్ర
8
ఉత్తరాఖండ్‌
5
కర్ణాటక
3
గుజరాత్‌
3
బిహార్‌
3
తెలంగాణ
2
హిమాచల్‌ప్రదేశ్‌
2
జమ్మూ-కశ్మీర్‌
2
కేరళ
2

⭐ తెలంగాణలోనూ ఇద్దరి నిర్బంధం
ఆగస్టు 12న నిర్వహించిన బహుళ రాష్ట్రాల ఆపరేషన్‌లో తెలంగాణలో
2 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 253 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.

80కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు – 200కు పైగా అరెస్టులు
SBNతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్న వ్యక్తులపై వివిధ రాష్ట్రాల్లో
80కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు – 200కు పైగా అరెస్టులు నమోదైనట్లు
హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. UAPA, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టం,
పేలుడు పదార్థాల చట్టం – మాదకద్రవ్యాల చట్టం తదితర నిబంధనల కింద కేసులు నమోదయ్యాయి.

స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం పేర్కొన్నవి
  • ఐఈడీలు
  • గ్రెనేడ్లు
  • పిస్టళ్లు
  • లైవ్‌ కార్ట్రిడ్జ్‌లు
  • నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాలు

గ్రెనేడ్లపై పాకిస్థాన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ గుర్తులు ఉన్నట్లు
హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

⚖️ పలు చట్టాల కింద కేసులు
భారతీయ న్యాయ సంహిత – 2023, ఆయుధాల చట్టం – 1959, UAPA – 1967,
ఎక్స్‌ప్లోసివ్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ – 1908, ఎక్స్‌ప్లోసివ్స్‌ యాక్ట్‌ – 1884,
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ – 2000, ఢిల్లీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ డిఫేస్‌మెంట్‌
ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌ – 2007, అధికారిక రహస్యాల చట్టం – 1923,
ఇమ్మిగ్రేషన్‌ – ఫారినర్స్‌ యాక్ట్‌ – 2025 తదితర చట్టాల కింద కేసులు నమోదైనట్లు
కేంద్రం తెలిపింది.

కేంద్రం ప్రకారం:
షాజాద్‌ భట్టి నెట్‌వర్క్‌ భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిందని కేంద్ర ప్రభుత్వం
తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. SBNపై చర్యలు సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై
కేంద్రం ప్రకటించిన కఠిన వైఖరిలో భాగంగా చేపట్టినట్లు వెల్లడించింది.