Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పై పని ఒత్తిడి…

పని ఎక్కువ -పైసలు తక్కువ...15000 వేలకు 10 వేలు ఇస్తారు... ! తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాన్ని చెల్లించాలి.
SAI MANIKANTA
September 24, 2026 · 5 days క్రితం
◉ 13 Views ↗ 1 Shares

తూప్రాన్, 23 సెప్టెంబర్ ( నవజ్యోతి ప్రతినిధి నవీన్ ) :

 

తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి సెప్టెంబర్ నెల పూర్తి కావస్తున్న నేటికి ఆగస్టు నెల వేతనం అందక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. అలాగే ప్రభుత్వం మే నెలలో జీవో నం 6 విడుదల చేసిందని కానీ ఈ జీవో ను ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు అమలు చేయడం లేదని వెంటనే అమలు చేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే ఆసుపత్రిలో ఓపి ల(రోగుల) సంఖ్య గణనీయంగా పెరిగిందని కార్మికుల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల పైన పని భారం అధికమవుతుందన్నారు.

అలాగే కార్మికులకు పిఎఫ్ పథకాన్ని ను సక్రమంగా అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న వేతనం తో పాటు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 6 ను ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల అందరికీ అమలు చేయాలని, ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మి,మహాశ్వరి,నవనిత,శ్యామల తదితరులు పాల్గొన్నారు

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram