శ్రీవారి సన్నిధిలో చందాయిపేట మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతా భాగ్యరాజ్ దంపతులు
చేగుంట నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
చేగుంట మండలం చందాయిపేట గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ గారు కుటుంబ సమేతంగా తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు.కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో అత్యంత విశిష్టమైన పుష్పయాగం, స్వామివారి పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.చందాయిపేట గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, చేగుంట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని,పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించారు.అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ గారికి,వారి కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి, శేషవస్త్రంతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. భక్తిభావంతో తిరుమల యాత్రను ముగించుకున్నారు.






