నర్సాపూర్ లో చేయూత పింఛన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వు-మంత్రి వివేక్
నర్సాపూర్ నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
నర్సాపూర్:తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నర్సాపూర్ లో ఘనంగా జరిగింది. నర్సాపూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రాలను అందజేశారు.మొత్తం 26 మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా పింఛను పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.వీరిలో ఐదుగురు వికలాంగులు ఉన్నారు. కొత్త పింఛన్లు రావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, దామరంచ సర్పంచ్ వెల్దుర్తి నాగమణి విఠల్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని నాయకులు తెలిపారు.కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






