భూగర్భ జలాలను కాపాడుకుందాం-ఎంపీడీవో దామోదర్ ఎమ్మార్వో మాలతి
– పంట మార్పిడితో నేలసారం అధిక దిగుబడి
చిన్న శంకరంపేట(రా)నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
చిన్నశంకరంపేట(రా): రైతులు అరుతడి పంటలు సాగు చేయాలని తాసిల్దార్ మాలతి, ఎంపీడీవో దామోదర్ అన్నారు. గురువారం మండలంలోని భాగిర్తీపల్లి, సూరారం గ్రామాలలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎల్ నీవో సందర్భంగా రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండే పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న, శనిగలు కూరగాయలు ఆకుకూరలు సాగు చేసుకోవాలని సూచించారు. అలాగే నీటి నిల్వ చేసుకోవడానికి పాంపడ్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్, మ్యూజిక్ సోక్ ఫిట్స్ లాంటివి నిర్మించాలన్నారు. వీబీజి రామ్ జీ పథకాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మాలతి ఎంపీడీవో దామోదర్ వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్,సర్పంచ్ చిలుక నాగరాజు, బాగిత్తిపల్లి సర్పంచ్,సూళ్ళ సావిత్రి పోచయ్య,తోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






