Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

డంపింగ్ యార్డు తొలగించే వరకు పోరాటం ఆగదు

డీపీఆర్ ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తా: ఎంపీ ఈటల రాజేందర్
October 31, 2026 · 10 hours క్రితం
◉ 6 Views ↗ 0 Shares

జవహర్‌నగర్, అక్టోబర్ 30 (నవజ్యోతి ప్రతినిధి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. డంపింగ్ యార్డు తొలగింపునకు అవసరమైన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో నిధులు తీసుకొస్తామని ప్రకటించారు. నిధులు సాధించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చెత్త కారణంగా చెరువులు కలుషితమవుతున్నాయని, ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాంకీ సంస్థ తప్పుడు నివేదికలతో మభ్యపెట్టవద్దని హెచ్చరించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram