Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం: మంత్రి శ్రీధర్‌బాబు

రైతులకు నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం
October 31, 2026 · 10 hours క్రితం
◉ 7 Views ↗ 0 Shares

జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 30 (నవజ్యోతి ప్రతినిధి): ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. చిట్యాల మండలం ఒడితల గ్రామంలో రూ.2 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 12 సబ్‌స్టేషన్లు, 127 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. రబీ పంటల సాగుపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి గోదావరి జలాలను అందించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఏసీపీ సిరిశెట్టి సంకీర్త్, సర్పంచ్ బండి భగవాన్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram