పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష
తుంగతుర్తి, అక్టోబర్ 30 (నవజ్యోతి ప్రతినిధి): నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ హాజరై పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై నాయకులతో చర్చించారు. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న నమోదు కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలవారీగా నియమించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిలతో నమోదు ప్రక్రియకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా నాయకులు తమ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, ఎస్‌ఏ రజాక్, మున్నా మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిలు, మండల ముఖ్య నాయకులు హాజరయ్యారు. పట్టభద్రుల ఓటరు నమోదు అంశమే ప్రధాన అజెండాగా సమావేశం కొనసాగింది.






