Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

సీతారామ భద్ర క్షేత్రానికి మరో భారీ విరాళం!

ఆలయ నిర్మాణానికి రూ.1,50,116 అందజేసిన ఎన్నారై దంపతులు
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 31, 2026 · 1 minute క్రితం
◉ 1 Views ↗ 1 Shares
Oplus_16908288

బిక్కనూరు, అక్టోబర్‌ 31 (నవజ్యోతి ప్రతినిధి): భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలో నిర్మిస్తున్న శ్రీ సీతారామ భద్ర క్షేత్రం మందిర నిర్మాణానికి బస్వాపూర్‌ వాస్తవ్యులైన ఎన్నారై దంపతులు పందిరి శ్రీలత, రాజిరెడ్డి, కొంపల్లి, హైదరాబాద్‌ నివాసులు రూ.1,50,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి దాతలను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన దాతలు, వారి కుటుంబ సభ్యులపై శ్రీరామచంద్ర స్వామి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram