వ్యవసాయంలో కొత్త ఒరవడి- మెగా రైతు మేళకు తరలిన నార్సింగి రైతులు
◉ 8 Views
↗ 0 Shares
నార్సింగి నవజ్యోతి ప్రతినిధి ముకుంద్
నార్సింగి, మెదక్ జిల్లా: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రైతు మేళ సదస్సుకు నార్సింగి మండలం నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏవో భరత్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యెన్నం రాజేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో రైతులు సదస్సుకు బయలుదేరారు.ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు,కొత్త వంగడాలపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ మేళ ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు.రైతు మేళలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇస్తారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యెన్నం రాజేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మండలానికి చెందిన పలువురు రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






