Sunday, November 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

రైతన్న కోసం పొలం బాట పట్టిన బట్టి అజయ్-రైతుల ఆవేదన వింటే కన్నీళ్లు వస్తున్నాయి

November 12, 2026 · 2 weeks క్రితం
◉ 12 Views ↗ 0 Shares

చిన్న శంకరంపేట(రా) నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
చిన్న శంకరంపేట(రా):చిన్న శంకరంపేట మండల వ్యాప్తంగా రైతన్న కోసం పొలం బాట పట్టారు మెదక్ టీఆర్ఎస్ ఇన్చార్జి బట్టి అజయ్. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో వరి పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆయన స్వయంగా వారి పొలాల వద్దకే వెళ్లి పరామర్శించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించారు.చిన్న శంకరంపేట మండల వ్యాప్తంగా, రామాయంపేట, నిజాంపేట్ మండలాల్లోని పలు గ్రామాల్లో బట్టి అజయ్ పర్యటించారు. వర్షాలు లేక, ఉన్న నీటితో కూడా వరి పంటలు ఎండిపోయి, పంట చేతికి రాక రైతులు కన్నీరు పెడుతున్న తీరును చూసి ఆయన చలించిపోయారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ గోడును ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. “అప్పులు చేసి పంట వేస్తే వర్షాభావంతో ఎండిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు” అంటూ కన్నీరు పెట్టారు. ఆ మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయని అక్కడున్న వారు అన్నారు.ఈ సందర్భంగా బట్టి అజయ్ మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వందల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని, రైతుకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టానికి పరిహారం అందించి, రైతులకు భరోసా కల్పించాలని కోరారు.నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని బట్టి అజయ్ స్పష్టం చేశారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram